అభివృద్ధిలో మేము సైతం
– సీఎం కేసీఆర్‌తో ఢిల్లీ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్,డిసెంబర్,05(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధి తాము భాగస్వాముల మవుతామని ఢిల్లీకి చెందిన జిలీడ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. శనివారం కాలిఫోర్నియాకు చెందిన జిలీడ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో తాము పాలుపంచుకుంటామని వారు తెలిపారు. హైదరాబాద్‌లోని ఫార్మాసిటీలో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని సీఎంకు జిలీడ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక వైద్యారోగ్య కార్యకలాపాల్లో భాగస్వాములవుతామని వారు చెప్పారు. రాష్ట్రంలోని వైద్యారోగ్య సదుపాయాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపారు. ఇదిలావుంటే సీఎం కేసీఆర్ లెండిి ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖరాశారు. తెలంగాణ, మహారాష్ట్ర అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు విషయమై భూసేకరణ, ముంపునకు గురయ్యే గ్రామాల పునరావాసం, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు, పెండింగ్ పనుల పూర్తి తదితర అంశాలను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు నిమిత్తం తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.189.73 కోట్లు డిపాజిట్ చేసిందని, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.275.83కోట్ల నుంచి రూ.554.54కోట్లకు పెంచినట్లు సీఎం వివరించారు. చొరవ తీసుకుని పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఫడ్నవీస్‌ను కేసీఆర్ కోరారు.