అభివృద్ధి కనిపించకపోతే కంటి వెలుగులో చూపించుకోండి..

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి.

కాంగ్రెస్ విమర్శలపై బగ్గుమన్న మున్సిపల్ పాలకవర్గం

మంత్రి కేటీఆర్ జోలికొస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణానికి చేస్తున్న అభివృద్ధి కనిపించకపోతే కంటి వెలుగులో కాంగ్రెస్ నాయకులు చూపించుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ పలువురు పాలకవర్గ సభ్యులు విమర్శించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ జింథం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ తో పాటు పలువురు పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా మున్సిపల్ పాలకవర్గం, అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రకృతి చేసిన విధ్వంసాన్ని మంత్రి కేటీఆర్ సహకారంతో తిరిగి పునర్జీవం తీసుకొస్తున్న క్రమంలో పాలకవర్గం అధికారులు ప్రజలతో ఉండి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి తోపాటు పలువురు నాయకులు మున్సిపల్ పాలకవర్గంపై అధికారులపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఫోటోలకు ఫోజులు ఇస్తూ సిరిసిల్ల పట్టణానికి గెస్ట్ ల వచ్చి పోయే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి కి సిరిసిల్ల పట్టణంలో మంత్రి కేటీఆర్ సహకారంతో చేసిన అభివృద్ధి కనిపించకపోతే కంటి వెలుగులో చూపించుకోవాలని హితవు పలికారు. మహిళ మున్సిపల్ చైర్పర్సన్ అని చూడకుండా వేలు చూపిస్తూ మాట్లాడమెంటని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పై అనవసరమైన విమర్శలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకొరాని తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు గడ్డం లత, లింగంపల్లి సత్యనారాయణ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు