అభివృద్ధి జరగాలంటే పట్టణ ప్రగతి తోనే సాధ్యం కార్పొరేటర్
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ పద్మావతి కాలనీ లక్ష్మీ నారాయణ కాలనీ లో స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ పట్టణ ప్రగతి లో భాగంగా పర్యటించడం జరిగింది. మంగళవారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వివిధ కాలనీలలో ఉన్న సమస్యలను కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే కార్పొరేటర్ అధికారులతో కలిసి డ్రైనేజీ పేరుకుపోవడంతో పూడికతీత పనులు చేపట్టి వర్షాకాలంలో నీరు నిలువకుండా ఉండేందుకు డ్రైనేజీ పనులు వెంటనే శుభ్రం చేసి పరిసరాల పరిశుభ్రత పాటించాలి కాలనీ ప్రజలకు సూచించారు. లక్ష్మీ నారాయణ కాలనీ నూతన సీసీ రోడ్డు ను కార్పొరేటర్ ప్రారంభించారు. డివిజన్ లోని ప్రతి కాలనీలో వర్షాకాలంలో ఎలాంటి ముప్పు గురికాకుండా జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, కాలనీవాసులు లక్ష్మీనారాయణ, గోపి,చంద్రశేఖర్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు భాస్కర్ రావు, అనంతుల సంతోష్, ప్రభాకర్, మోసిన్, ముత్యాలు, సురేష్, మైవాన్, సుదేష్, షేక్, షబ్బీర్, నరేష్, మురళి, కిట్టు, ఉదయ,స్వప్న,రమ, తదితరులు పాల్గొన్నారు.



