అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
వేమనపల్లి, ఫిబ్రవరి 16,(జనంసాక్షి)
మండలంలోని జక్కపల్లి గ్రామం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బుయ్యారం సూరారం జిల్లేడ సంపుటం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 1 కోటి46 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులతో పాటు మండల కేంద్రంలోని మత్తడి వాగు వంతెన నిర్మాణానికి రూ.6 కోట్ల15లక్షల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణా పనులను గురువారం కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.నీల్వాయి నుండి రాచర్ల వరకు 6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మూడు కల్వర్టు పనులను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్ని ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి చేయడంలో రాజీ పడేది లేదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు,పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని,అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దేశం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లారని అన్నారు.అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఎమ్మెల్యే మండిపడ్డారు.భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారు అధికారంలో ఉన్న గత 50 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న విలేకరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలి స్వర్ణలత,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోలి వేణుమాధవరావు,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.