అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి*
*రాజేంద్రనగర్. ఆర్.సి ( జనం సాక్షి) : డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి డివిజన్లోని గగన్ పహాడ్ లో నూతనంగా చేయబోయే సిసి రోడ్లను స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించి పరిశీలించిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
అభివృద్ధి పనులల్లో నాణ్యత లోపాలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో నిర్ణిత సమయంలో త్వరితగతిన పనులను పూర్తి చేసి డివిజన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారనికి అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే ద్యేయంగా అను నిత్యం కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ లోనే అన్ని రంగాళ్లలో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చి దిద్దడానికి ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణతో అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో సురేష్ యాదవ్ , తిరుపతమ్మ , యశోద , నరేష్ , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : గగన్ పహాడ్ లో పర్యటిస్తున్న కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.