అభివృద్ధి పనుల ప్రారంభం
పులకల్: మండలంలో చేపట్టిన రూ. 14కోట్ల అభివృద్ధి పనులను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దామోదర్ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా పులకల్‌లో గురుకుల పాఠశాల, సింగూరు ప్రాజెక్టుపై వంతెన, స్త్రీ శక్తి భవనం , విద్యుత్తు ఉపకేంద్రం… ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భారతి, అదనపు సంయుక్త కలెక్టర్ మూర్తి, తహశీల్దార్ ధశరధ్‌సింగ్, ఎంపీడీవో హేమలత తదితరులు పాల్గొన్నారు.