అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదు : బొత్స
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదని పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. 24వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే అభివృద్ధి రుసుం వసూలు చేయనున్నట్లు తెలియజేశారు. అయితే రుసుం ఎప్పటి నుంచి అమలు చేయాలన్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.