అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో నెం.1గా తెలంగాణ 

 ఆరోగ్య తెలంగాణ దిశగా చర్యలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించా
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
కామిడి వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి
మేడ్చల్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ 1గా నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లాలోని శావిూర్‌పేట మండలం మూడుచింతలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అక్కడ రూ.99 లక్షలతో నిర్మించిన కామిడి వీరారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రూ. 75 లక్షలతో నిర్మించబోయే మల్టిపర్సస్‌ కమ్యూనిటీ హాల్‌కు, రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే పేదవారు జమికేవారని, ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, తద్వారా కార్పోరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దీంతో ఉన్నత కుటుంబాలవారు  సైతం వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో అనుహ్యమైన మార్పు చోటు చేసుకుందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు వాటి రూపురేఖలు మార్చేశామని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బంగారు తెలంగాణెళి లక్ష్యంగా కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని అన్నారు. అందులో భాగంగా మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతు సమన్వయ సమితులు, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్లు వంటి అద్భుత పథకాలతో కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారని అన్నారు. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి పర్చేందుకు కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.