అమరావతి నిర్మాణానికి నిధులివ్వకుంటే పన్నులెందుకు కట్టాలి
రాజధాని భూముల అమ్మకాలతో ముందుకు వెళతాం
మహానాడులో చంద్రబాబు ఘాటు విమర్శలు
యూసిలపై మంత్రి సుజయ్‌కృష్ణ ప్రజెంటేషన్
కేంద్రం తీరుపై మండిపాటు
విజయవాడ,మే29(జనం సాక్షి ): అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఇవ్వకుంటే తాము పన్నులెందుకు కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. అమరావతికి రూ.2,500కోట్లు ఇచ్చామని అసత్యాలు చెబుతున్న అమిత్ షా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. మహానాడు మూడో రోజున అమరావతి నిర్మాణంపై పెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడారు.
రూ.95 వేల కోట్లతో గుజరాత్‌లో డోలేరో నగరాన్ని నిర్మించుకుంటున్న భాజపా నేతలు.. ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు కూడా అమరావతికి ఇవ్వరా? అని ప్రశ్నించారు. సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 22 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని.. ప్రజల భాగస్వామ్యంతో.. తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలే లక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను చిన్నారులు.. విదేశాల్లో ఆర్జించిన సంపాదనలో కొంత మొత్తాని ఎన్నారైలు సైతం విరాళాలుగా రాజధాని నిర్మాణం కోసం ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రూ.75 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపారు. రాజధానిలో రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసిన అనంతరం 5 వేల ఎకరాలను విక్రయించుకుని రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే అవకాశముందని సీఎం తెలిపారు. రాజధాని నిర్మాణం అంటే గిట్టని, నచ్చని వ్యక్తులు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఆఖరు నిమిషంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మారిన ఓ వ్యక్తి.. బీజేపీకి అ/-దదె మైకు, వైకాపాకు సొంతమైకులా మాట్లాడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. వీరి కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు.
విభజన హావిూలు నెరవేర్చాలని అడిగితే కేంద్రం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడు చివరిరోజు ‘ప్రజా రాజధాని- మన అమరావతి- ఆనంద నగరం’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సహా కేంద్రానికి సమర్పించిన ఆధార సహిత యూసీలను ప్రదర్శించారు. సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు వారికి ఓ విశ్వనగరం ఉండాలన్న ఉద్దేశంతోనే అమరావతిని నిర్మిస్తున్నాం. మనం ఇచ్చిన పిలుపుతో రైతులు ఏకంగా 33వేల ఎకరాలు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తెదేపా ప్రభుత్వం విూద ప్రజలకున్న విశ్వసనీయతను ఇది తెలియజేస్తోంది. అమరావతిలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులతో ఆస్పత్రులు వస్తున్నాయి. అమరావతిలో అనుకున్న పనులన్నీ పూర్తి కావాలంటే మొదటి విడత రూ.45వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోంది. ఇచ్చిన యూసీలన్నీ తప్పని చెబుతోంది. గుజరాత్‌కు ఇష్టం వచ్చిన రీతిలో నిధులు కేటాయిస్తారు.. మనం రాజధాని కోసం అడిగితే మాత్రం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మన రాష్ట్రంలోని కొన్ని పార్టీలు పదవుల కోసం పాకులాడుతూ కేంద్రానికి వత్తాసు పలుతుకున్నాయి. రాష్ట్రం ప్రయోజనాలకు ఎవరు అడ్డుతగిలినా ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. కేంద్రం రాజధానికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని మహానాడులో మంత్రి సుజయకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీలు ఇచ్చినా బీపీఆర్‌లు పంపినా కేంద్రం ఏమాత్రం స్పందించలేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం, నరేగ నిధులకు సంబంధించిన యూసీల వివరాలపై మంత్రి మహానాడులో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం పంపిన యూసీల వివరాలు అందినట్లు కేంద్రం పంపిన లేఖలు, నిధుల విడుదలపై నీతి అయోగ్ సిఫార్స్ లేఖలను ఆయన ప్రదర్శించారు. రాజధాని కోసం అన్ని కబుర్లు చెప్పిన కేంద్రం కేవలం రూ. 1500 కోట్లే ఇచ్చిందని మంత్రి తెలిపారు. మొత్తం 8 డాక్యుమెంట్లపై మంత్రి మహానాడులో ప్రదర్శించారు. ఎన్నికల ముందు తిరుపతి, నెల్లూరు సభల్లో మోదీ ప్రసంగం, రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ ప్రసంగాన్ని కూడా మహానాడులో సుజయకృష్ణ ప్రజెంటేషన్ ఇచ్చారు.