అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు

l3tsyz8aమొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్ప గుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం అక్కడున్న సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. 1914 లో జూలై నుంచి 1918 డిసెంబర్ వరకు దాదాపు నాలుగేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో.. 15 లక్షల మంది భారత సైనికులు పాల్గొన్నారు. వారిలో 75 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.