అమర వీర జవాన్లకు అశ్రునివాళి!

హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) : పెరేడ్‌ గ్రౌండ్‌లో విజయదివాస్‌ ఉత్సవం జరిగింది. కార్గిల్‌ విజయో త్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్గిల్‌ యుద్ధంలో అసువులు బాసిన అమర వీర జవాన్లకు నివాళులర్పించారు. రాష్ట్ర మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉద్వేగభరితంగా కొనసాగింది. ప్రజలు కూడా స్వచ్చందంగా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

తాజావార్తలు