అమితాబ్‌ బచ్చన్‌కు చేదు అనుభవం

 

ముంబయి నవంబర్‌ 15,(జనంసాక్షి)

శివ సేన చీఫ్‌ బాల్‌ధాక్రేసు ఆయన నివాసమైన మాతాశ్రీలో పరామర్శించేందుకు వెళ్లిన ప్రముఖ హిందీరంగ చలనచిత్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు చేదు అనుభవం ఎదురైంది ఆయన నివాసం వద్ద చేరిన పలువురు అభిమానులను సంయమనం పాటించాల్సిందిగా అమితాబ్‌ విజ్ఞప్తే చేశారు కాని ఆందోళనతో ఉన్నగుంపు ఆయనపైదాడి చేసింది గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఉద్వేగపూరిత వార్తలు రావటంతో కార్యకర్తలు తీవ్ర కలవరానికి గురయ్యారు ఈ దాడిలో బచ్చన్‌ గాయపడ్డారు ఆయన కుర్తాను చించేశారు చేతిపై గాయాలయ్యాయి కాని ఇవి ప్రమాదకరమైన గాయాలు కావు అక్కడే డాక్టర్లు తనకు చికిత్స చేశారని అమితాబ్‌ తనట్విట్టర్‌ పేజిలో పోస్ట్‌చేశారు తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు ధాక్రేతో తన గత అనుభవాలను పంచుకున్నారు బోఫోర్స్‌ కుంభకోణంలో నీకు ప్రమేయం ఉందా అని ధాక్రే అమితాబ్‌ను ప్రశ్నించారు లేదని ఆయన జవాబిచ్చారు అయితే కంగారు పడవడ్డు నీవు ఒక నటుడివి.అలాగే ఉండు అదే నీకు మంచిది నీకు నేను మద్దతుగా ఉంటాను అని ధాక్రే ఆయనతో అన్నారు.