అమృత్ సరోవర్ పాండ్స్ ను 15 ఆగష్టు లోగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నల్లగొండ బ్యూరో. జనం సాక్షి
అమృత్ సరోవర్ పథకం కింద గుర్తించిన 75 అమృత్ సరోవర్ పాండ్స్ ను ఆగష్టు-15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.బుధవారంనాడు జిల్లా కలెక్టరేట్ నుండి ఎం.పి.డి.ఓ.లు, ఎం.పి.ఓ.లను, ఎ.పి.ఓ.లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల బయోఫెన్సింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అదే విధంగా ఇప్పటి వరకు పూర్తి చేసిన బయో ఫెన్సింగ్ ఫోటోలను వెంటనే తనకు పంపించాలని ఆయన తెలిపారు. క్రీడా ప్రాంగణాలు, బృహాత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు లో గ్రామ కార్యదర్శులు ప్రముఖ పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్థలాలలో క్రీడా ప్రాంగణాలను స్థాపించాలని ఆయన తెలిపారు. లే ఔట్స్ ఏర్పాటు చేసిన చోట క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ప్రారంభించాలని ఆయన తెలిపారు. క్రీడా ప్రాంగణాలకు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించినా కూడా ఎక్కడైనా బౌండరీలు గుర్తించనవి తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత తహశీల్దార్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని ఆయన అన్నారు. అదే విధంగా అటవీ శాఖ భూములలో మొక్కలు నాటాలని ఎక్కడైనా భూ సమస్యలు ఉంటే తనకు నివేదిక రూపంలో సమర్పించాలని ఆయన తెలిపారు. హరిత హారం కార్యక్కమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లక్ష్యానికి అనుగునంగా నూటికి నూరు శాతం మొక్కలు నాటాలని అధికారులకు వివరించారు. మండలస్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా పంచాయితీ అధికారిని కోరారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్ మస్టర్లను పూర్తి చేయడంతోపాటు, రిజిక్టెడ్ అకౌంట్లను సరి చేయాలని ఆయన అధికారులకు తెలిపారు.
ఈ వీడియో కాన్పరెన్సులో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. ప్రేమ్ కరణ్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ. కాళిందిని, జిల్లా పంచాయితీ అధాకారి విష్ణువర్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.