అమెరికాలో కాల్పుల కలకలం
– మహిళ మృతి
అస్టిన్ ,జులై 31(జనంసాక్షి):అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన అస్టిన్ (టెక్సార్ రాష్ట్ర రాజధాని)లో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరంలోని డౌన్ టౌన్ లోకి తుపాకితో ప్రవేశించిన దుండగుడు రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డాడని అస్టిన్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారాన్నిబట్టి కాల్పుల్లో ఓ 30 ఏళ్ల మహిళ మృతి చెందింది. మరి కొంత మందికి గాయాలయ్యాయి.డౌన్ టౌన్ లోని ఈస్ట్ స్ట్రీట్, 208 వద్ద బుల్లెట్ దెబ్బలు తిన్న క్షతగాత్రులను గుర్తించామని, వారిని బ్రాకెన్ రిడ్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు తరలించామని పోలీసులు చెప్పారు. అయితే సాయుధుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. దీంతో పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.