అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

5

– 14 మంది మృతి

– దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అద్యక్షుడు బారక్‌ ఒబామా

వాషింగ్టన్‌,డిసెంబర్‌3(జనంసాక్షి): అమెరికాలో కాల్పుల ఘటన కలకలం చెలరేగుతోంది. పిట్టలను కాల్చినట్లు ప్రజలను కాల్చి పారేస్తున్నారు. ఆగంతకులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినో ప్రాంతంలోని వాటర్‌మూన్‌ అవెన్యూ సవిూపంలో బుధవారం ఉదయం దుండగులు జరిపిన కాల్పుల్లో 14మంది మృతిచెందగా, మరో 14మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనుకోని గఠనతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. శాన్‌బెర్నార్డినోని వికలాంగుల కేంద్రంలో హాలిడే పార్టీ జరుగుతున్న సమయంలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు ఆగంతకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల అనంతరం దుండగులు వాహనంలో పరారయ్యారు. ఈ ఘటనలో 14మంది మృతిచెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సవిూపంలోని భవనాల్లో బాంబుస్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దుండగుల కోసం భద్రతాధళాలు, పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. శాన్‌బెర్నార్డినోలోని వికలాంగుల కేంద్రానికి 3 కిలోవిూటర్ల దూరంలో పోలీసుల జరిపిన కాల్పుల్లో ఒక అనుమానితుడు మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తికి కాల్పుల ఘటనతో సంబంధం ఉందా? లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల అనంతరం దుండగులు నల్లరంగుకారులో పరారైనట్లు తమ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని శాన్‌బెర్నార్డినో పోలీసు అధికారులు  వెల్లడించారు. వారు ఎవరన్న అంశంపై ఎలాంటి సమాచారం లేదన్నారు. కాల్పులకు తెగబడటం వెనకున్న కారణమూ తెలియదని విూడియాకు వెల్లడించారు. ఆగంతకులు వచ్చిన తీరనుబట్టి.. వారు దాడికి పూర్తిగా సిద్ధమై వచ్చినట్లు స్పష్టమవుతోందన్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు దుండగుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్పందించారు. భద్రతా దళాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ… పరి/-థసితిని సవిూక్షిస్తున్నారు. దుండగులను పట్టుకునే వరకు ఆపరేషన్‌ కొనసాగించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. నవంబర్‌ 27న ఇదే రాష్ట్రంలోని కొలరాడోస్ప్రింగ్స్‌ పట్టణంలోని ఆసుపత్రి వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి సహా ముగ్గురు చనిపోయారు. కాల్పుల ఘటన అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విూడియాతో మాట్లాడుతూ . ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో మనదేశంలోనే వరుస కాల్పుల ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనల్ని పూర్తిగా ఆపలేకపోయినా.. ఇంత ఎక్కువగా జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టవచ్చన్నారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా …విమానాలు ఎక్కకూడదని వ్యక్తుల పేర్లతో ఓజాబితా ఉంటుంది. కానీ… ఆజాబితాలో ఉన్నవారు సైతం అమెరికాలో తుపాకీ కొనుక్కోవచ్చు. ఈ పరిస్థితిని మార్చేందుకు చట్టాన్ని సవరించాల్సిన అవసరముందని ఒబామా అభిప్రాయపడ్డారు.