అమెరికా ప్రభుత్వ యంగ్ పొయెట్ రాయబారిగా సూర్యాపేట బిడ్డ
టాప్ 5 లో నిలిచిన గరిడేపల్లి మండల విద్యార్థిని విధాత్రి
గరిడేపల్లి, అక్టోబర్ 1 (జనం సాక్షి): మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన ఓ సామాన్య రైతు కీత నాగేశ్వరరావు బిడ్డ కీత విధాత్రికి అమెరికాలో అరుదైన గౌరవం లభించిందన్నారు.చిన్న తనం నుండే ఎంతో కష్టపడి చదువుతూ అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణం. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన యంగ్ పోయెట్ రాయబారి సెలక్షన్ లో పాల్గొన్న ఐదు లక్షల మంది విద్యార్థులలో విధాత్రి టాప్ 5 గా నిలిచిందన్నారు. దీనితో అమెరికా ప్రభుత్వం విధాత్రిని యంగ్ పొయెట్ రాయబారిగా నియామకం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా దేశ అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నందు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ విధాత్రికి మెడల్ బహూకరించి అమెరికా ప్రభుత్వం నుండి 5000 డాలర్ల పారితోషికం అందజేసి సత్కరించడం జరిగిందన్నారు. మన భారత సంతతికి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల విద్యార్థిని ఈ ఘనత సాధించడం పట్ల యావత్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.