అమేథీ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

రాహుల్‌కు కౌంటర్‌ కోసం బిజెపి ఎత్తులు

రాయ్‌పూర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ఎంపిగా సొంత నియోజకవర్గం అమేథీలో వైఫల్యాలను బిజెపి ప్రచారం చేయడం ద్వారా రాహుల్‌ను ఎదుర్కోవాలని చూస్తోంది. అక్కడి నియోజకవర్గంలో ఏయే రంగాల్లో వైఫల్యం చెందారా చిట్టాను రెడీ చేశారు. ఆ మేరకు ప్రచారంలో ఇవే ప్రచారాస్త్రాలుగా ముందుకు సాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఇక్కడ ప్రచారం ప్రారంభించగా ఆయనకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ ఆది నుంచే పదునైన అస్త్రాలు సంధిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిపై ప్రశ్నలు కురిపించిన రాహుల్‌కి సీఎం రమణ్‌సింగ్‌ అంతేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌ ఎంపీగా ఉన్న అమేథిలో తనసామర్థ్యాన్ని నిరూపించుకోవాలనీ… రాష్ట్రంలో తాను చేసిన అభివృద్ధిలో రాహుల్‌ సగం చేసి చూపించినా చాలని రమణ్‌ సింగ్‌ సవాల్‌ విసిరారు. బీజేపీ ఇప్పటికే పలు అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేసిందనీ.. కాంగ్రెస్‌ పార్టీ అకారణంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. తాను చేపట్టిన వికాస్‌ యాత్ర యాత్రలో భాగంగా జరిగిన ఓ ర్యాలీలో సీఎం రమణ్‌ సింగ్‌ ప్రసంగిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్‌ చెబుతోంది. గ్రావిూణ ప్రాంతాల్లో సైతం ఇక్కడ కాంక్రీట్‌ రోడ్లుదర్శనమిస్తున్నాయి. వాళ్లకు అంతకంటే ఎక్కువ ఏంకావాలి? వారికి కావాల్సిందల్లా విమర్శించడమే. ఈ అభివృద్ధిలో రాహుల్‌ గాంధీ అమేథిలో సగం చేసి చూపించినా నేను సంతోషిస్తాను అని పేర్కొన్నారు. అంతేగాకుండా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోలేని అసమర్థ ఎంపి అన్న రీతిలో విమర్శలకు పదును పెట్టారు. గత నెలలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ ఛత్తీస్‌గఢ్‌లో బైక్‌ ర్యాలీలు, రోడ్‌షోలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రమణ్‌ సింగ్‌ ప్రభుత్వంపై రాహుల్‌ మాట్లాడుతూ.. రోడ్లు వేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అదే రోడ్లపై మావోయిస్టులు 32 మందిని చంపేశారు. ప్రభుత్వం ఎక్కడుంది? ప్రతిపక్షంలో ఓ సీనియర్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఎక్కడుంది ప్రభుత్వం? రాజకీయ నేతలనే కాపాడలేని ప్రభుత్వం.. ఆదివాసీలు, సామాన్య ప్రజలను ఎలా కాపాడగలదు? అలాంటి ప్రభుత్వం విూ ప్రగతికోసం ఎలా పనిచేస్తుంది?అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.దీనిని సమర్థంగా తిప్పి కొట్టేందుకు బిజెపి అమేథీ వ్యవహారాలను తెరపైకి తీసుకుని వస్తోంది. దీంట్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.