అమేధిలో ఘోరం

1

-బస్సు దగ్ధం

-9 మంది మృతి

లక్నో,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి):

ఉత్తరప్రదేశ్‌ లో  మంగళవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న  అమేథీ జిల్లా పీపర్పూర్‌ సవిూపంలో ఓ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిదిమంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.  మంగళవారం ఉదయం ప్రయాణికులతో బస్సు సుల్తాన్‌పూర్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.రాంగాన్‌ గ్రామ సవిూపంలోకి రాగానే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బస్సు ఇంజన్లో మంటలు చెలరేగినట్లు చెప్పారు.  ఆ సమయంలో బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారు.  మంటలు చెలరేగటంతో కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. మరికొంతమంది ఎటూతోచక లేదా తప్పించుకునే దారిలేక అందులో మాడి మసయ్యారు. అసలు మంటలు చెలరేగే సమయంలో ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఈ ఘోరం జరిగింది.  గాయపడినవారిని చికిత్స నిమిత్తం సుల్తాన్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  మృతి చెందినవారి వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సిఎం అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేవించారు. బాధితులకు అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాల వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.