అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతో షాలతో ఉండాలి.

 అన్నం పరబ్రహ్మ స్వరూపం.
మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు అగస్టు 26(జనంసాక్షి)అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గంజ్ ఆవరణలో వేలసిన శ్రీరేణుకా నాగ ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ మాసం భజన సమాప్తి సందర్భంగా  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్యాత్మిక కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుతో కలిసి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూప మన్నారు.అన్ని దానాలకన్న అన్నదానం గొప్పదని వెల్లడించారు.అన్నదానం చేయటం వల్ల జన్మజన్మల పున్యఫలం లబిస్తుందన్నారు. శ్రావణమాసం హిందువులకు ఎంతో పవిత్రమై నదని వివరించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,కౌన్సిలర్ రఘు ,సంగీత ఠాగూర్ ,బాలప్ప, డైరెక్టర్ లు రాఘపూరం భీంరెడ్డి,దినేష్ సింగ్ ఠాకూర్ ,దీగ్రీన్ అండ్ సీడ్స్ మార్చేట్  అసోసియేషన్ అద్యకార్యదర్శులు పటేల్ రాంరెడ్డి, వీరేషం ,గంజ్ హమాలి కార్మిక సంఘం ,గుమస్త సంఘం, దడువాయి సంఘం చాట సంఘం ప్రతినిధులు ఆలయ అర్చకులు, భజన మండలి భక్తులు తదితరులు పాల్గొన్నారు.