అమ్మా లే రోడ్డుమీద వచ్చే జనాలు ఏమైనా చేస్తారేమో వెళ్లిపోదాం

 

వానరంలోనూ మాతృత్వం

 

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్25(జనంసాక్షి)

 

సృష్టిలో తల్లిప్రేమ కు మించినది మరొకటి లేదు.ఆ మాతృత్వానికి కొలమానం అంతకంటే లేదు.ఈ మాటలకు సజీవరూపమే ఈ దృశ్యం. చనిపోయిన తల్లికోసం పిల్లకోతి తపన చూస్తే కన్నీళ్లు ఆగవు. ఆదివారం ఉదయం రోడ్డు మీద సంచరిస్తున్న ఒక కోతిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో ఆ కోతి అక్కడికక్కడే చనిపోయింది. చనిపోయిన తల్లి కోతిని చూసిన పిల్ల కోతి, తన తల్లీకేమైందోనని తల్లి దేహం పై వాలి ఏడుస్తూ ఉంటే స్థానికులను ఉద్వేగానికి గురిచేసిన ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ పంచాయతీ పరిధిలోని గంపెళ్లగూడెం గ్రామంలో వెలుగు చూసింది. తన తల్లి బ్రతికే ఉందన్న నమ్మకంతో ఎక్కడికి వెళ్లకుండా రోడ్డు పైనే తల్లి ని వదలకుండా తల్లి కోతి పై పడి రోదిస్తుంది.తన తల్లికి ఏమైందో తెలియని ఆ పిల్ల కోతి ఆవేదనతో చూస్తున్న చూపులు రోడ్డు మీద వెళ్లే వాహనాల వల్ల పిల్లకోతికి ఏమైనా అవుతుందేమో అని స్థానికులు ఆ పిల్ల కోతిని తరలించే ప్రయత్నం ఎంత చేసినా ఆ బిడ్డ అక్కడనుండి కదలకపోవడం తో మనుషులకే కాదు మూగ జీవుల్లో సైతం మాతృత్వం ఉంటుందని మరో మారు రుజువైంది.