అయిల్ ఫాం తోటలతో… తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం…

గద్వాల రూరల్ జూలై 01 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని చింతరేవుల గ్రామానికి చెందిన  రైతు ఈశ్వర్ లకు చెందిన 6.38 ఎకరాల విస్తీర్ణ పొలంలో దాదాపు 300 ఆయిల్‌ ఫాం మొక్కలను నాటడం జరిగింది.. మొక్కల నాటడానికి ముఖ్య అతిధులుగా ధరూర్ మండల‌ జెడ్పిటిసి పద్మ వేంకటేశ్వర రెడ్డి, ఎంపిపి నజ్మూనిస బేగం,వైస్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి.. హాజరై రైతులతో కలిసి ఆయిల్‌ ఫాం మొక్కులు నాటడం జరిగింది, ఈ సందర్భంగా జెడ్పిటిసి పద్మ వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతులు అరుగాలం శ్రమించి ఆదాయం కోసం ఆరు నెలలైన ఎదురు చూడాలి.కొన్ని సార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతుంది,ఇలాంటి సమయంలో ప్రతి నెల రైతుల ఖాతా లో డబ్బు జమ అయితే…! ఆ రైతు సంతోషమే వేరు…! ఇప్పుడు ఆయిల్ ఫాం సాగుతో  తక్కువ పెట్టుబడితో ఆశించిన ఆదాయం చేతికి వస్తుందని వారు రైతులకు సూచించారు… ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిల్ప ప్రభాకర్ గౌడ్,హార్టికల్చర్ అధికారి శ్రీనివాసాచారి,ఆయిల్ ఫాం అధికారి శివకుమార్, ఏఓ శ్రీలత,ఎఈఓ స్వరూప, ఎంపిడిఓ జబ్బార్ సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు..