అరటి తోటను ధ్వంసం చేసిన దుండగులు..
: గుర్తు తెలియని వ్యక్తులు అరటి తోటను ధ్వంసం చేసిన దృశ్యం …
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 14 (జనం సాక్షి)
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బంధంపల్లి గ్రామ శివారులో గల అరటి పంటను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని బంధం పల్లి గ్రామానికి చెందిన రైతు పోరెడ్డి సాంబ రెడ్డికి చెందిన అరటి తోటను గుర్తుతెలియని వ్యక్తులు చేతికి వచ్చిన పంట, పండ్లు పండడానికి వచ్చిన చెట్లను అరటి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని రైతు సాంబ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 25 కు పైగా అరటి గెలలను, చెట్లను ధ్వంసం చేశారని, కొన్ని గెలలను ధ్వంసం చేసి బావిలో పడవేశారని ఈ సందర్భంగా రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని నా పంటను నాశనం చేశారని, పోలీసులు స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా ఇదే వ్యవసాయ భూమిలో 20వేల రూపాయల విలువచేసే మోటారు దొంగలించడం జరిగిందన్నారు. చేతికొచ్చిన పంట పంటను దుండగులు నాశనం చేశారని సుమారు 25 వేల రూపాయలు నష్టం వాటి లేదని రైతు ఆవేదన చెందాడు.