ఇలాగైతే రాజీనామాలు చేస్తాం:జానారెడ్డి
హైదరాబాద్: కవాతుకు వస్తున్న తెలంగాణవాదుల అరెస్టుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడానని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. కవాతు నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కవాతు కోసం హైదరాబాద్ బాట పట్టిన తెలంగాణవాదులను అరెస్టు చేయడంపై జానారెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పదవులు లెక్కచేయాల్సిన అవసరంలేరిని పరిస్థితి వచ్చందని జానా వ్యాఖ్యానించారు.




