అర్ధాంతరంగా ముగిసిన మిస్త్రీ పర్యటన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతగా ఇక్కడకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , కార్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మధుసూదన్‌ మిస్త్రీ రాష్ట్ర పర్యటన అర్దాంతరంగా ముగిసింది. ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మిగిలిన జిల్లాల సమీక్షలు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడుతో జరగవలసిన భేటీలు కూడా వాయిదా పడ్డాయి. ఈ భేటీలు త్వరలో ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.