అర్ధాకలితో జీవిస్తున్న విఆర్ఎలను ఆదుకోవాలని తహశీల్దార్ కు వినతి.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మర్చిపోకుండా విఆర్ఎల పే స్కెల్ ను విడుదల చేయాలని కోరుతూ విఆర్ఎ సంఘం సభ్యులు గురువారం రోజున మండల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ పవన్ చంద్రకు వారి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోపోవడలో విఆర్ఎలు ప్రధాన భూమిక పోషిస్తున్నారని అన్నారు.చాలీచాలని వేతనాలు తీసుకుంటూ అర్ధాకలితో కుటుంబాలు పోసిస్తున్నారని అందుచేత కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పే స్కెల్ జిఓను వెంటనే విడుదల చేయాలని,అర్హతలు కలిగిన విఆర్ఏలను ప్రమోషన్ కల్పించాలని,55 సవంత్సరాలు పైబడిన విఆర్ఎల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విఆర్ఎ సంఘం ప్రెసిడెంట్ వై పెద్దులు,జనరల్ సెక్రటరీ సంటెన్న,వైస్ ప్రెసిడెంట్ ఎండి రఫీక్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area