అర్హులందరికీ ఆసరా పింఛన్….

ఎమ్మెల్యే మదన్ రెడ్డి…..
నర్సాపూర్ సెప్టెంబర్,  21, ( జనం సాక్షి)  :
57 సంవత్సరాలు నిండిన పేద ప్రజలందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట చిన్నచింతకుంట గ్రామాల్లో మంజూరైన ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద చింతకుంట గ్రామ సర్పంచ్ గుండె శివకుమార్ చిన్నచింతకుంట సర్పంచ్ బుర్ర సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ వృద్ధాప్య వితంతు పింఛన్లను కేవలం 200 రూపాయలు మాత్రమే ఇచ్చేదని తెలంగాణ ప్రభుత్వ హయాంలో 57 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ గ్రామాల్లో అర్హులై ఉండి పింఛన్ రాని వారికి ఇప్పిస్తామని అన్నారు అంతేగాక టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు రైతుబంధు భీమా కళ్యాణ లక్ష్మి పింఛన్లు తోపాటు 24 గంటల కరెంటు తాగు సాగునీరు వంటి సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు మెదక్ జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన పెద్ద చింతకుంట గ్రామ సర్పంచ్ గుండె శివ కుమార్ ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ప్రతి ఒక్క సర్పంచ్ గుండె  శివ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని మిగతా సర్పంచులు తమ గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో ముందు కు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రెండు గ్రామాల్లో పింఛన్లు మంజూరైన వారికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా ఆసరా పింఛన్ల కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ  అశోక్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి టిఆర్ఎస్  రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా,మండల అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, సింగిల్ విండో డైరెక్టర్ కృపాచారి, సర్పంచులు శివ కుమార్ ,సురేష్ గౌడ్ రవి,  వెంకటేష్, లింగం, యాదవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail