అర్హులైన ప్రతి రైతుకూ చెక్కుల పంపిణీ

పెట్టుబడికి వినియోగించుకోవాలి: జూపల్లి
నాగర్‌కర్నూల్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు చెక్కు ఇస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్‌పల్లిలో రైతులకు మంత్రి చెక్కులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు రైతు బంధు చెక్కుల ద్వారా ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. రైతుబంధు పథకం ద్వారా మరోసారి రైతన్నకు అండగా ఎలా నిలవచ్చో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని పేర్కొన్నారు. రైతన్న బాగు కోరి పెద్దమనసుతో సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. రైతన్న బాగు కోరి పెద్దమనసుతో సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు చెక్కు ఇస్తున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు రైతు బంధు చెక్కుల ద్వారా ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న డబ్బులను వ్యవసాయానికి వినియోగించుకోవాలని అన్నారు. రైతుల కష్టాలను చూస్తున్నానని, ఏటా పంట పెట్టుబడుల
కోసం ఇబ్బందులు పడుతారని తెలిపారు. బ్యాంకు రుణాలు సకాలంలో అందక ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకొస్తారన్నారు. బ్యాంకు అకౌంట్‌తో సంబంధం లేకుండా రైతులు నేరుగా డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు.
——-