అర్హులైన వారందరికీ దళిత బంధు ఇవ్వాలి – కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు
కమాన్ పూర్, జనం సాక్షి :అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీలో ఆర్థికంగా లాభపడిన వారికి నాలుగైదు ఎకరాల భూములు ఉన్నవారికి, బంగ్లాలో నివాసమున్న వారికి మాత్రమే ఎంపిక ఎలా చేశారు..?అని ప్రశ్నించారు. నిరుపేద దళిత కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదు మండలంలోని 1400 దళిత కుటుంబాలు ఉండగా నామమాత్రంగానే దళిత బంధు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
కమాన్ పూర్ మండలంలో అధికార పార్టీ వారు గులాబీ కండువలకే దలిత బందు ఇవ్వడం జరిగిందని మండల అద్యక్షుడు వైనల రాజు ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన దళిత బందులో అనర్హులైన వారికే దళిత బందు ఇచ్చారని ఆరోపించారు. ఎందరో నిరుపేదలు ఉన్నప్పటికీ ప్రస్తుతం బంగ్లలు కార్లు, ఉన్న ధనవంతులైన వారికే ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. మండల కేంద్రంలో దళిత పాత్రికేయుడు ఆరేపల్లి శంకర్ ను విస్మరించడం సరికాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మండలంలో పార్టీలకతీతంగా దళిత బంధు ఇవ్వాలని , పైరవీలు ఉన్న వారికే దళిత బందు ఇచ్చారని అన్నారు. ఇప్పటికైనా అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశములో భూoపెల్లి రాజయ్య , సిలారపు మల్లయ్య, ఎండీ అఫ్సర్, ఒడ్నల శ్రీనివాస్, బాద్రపు శంకర్,చిగురు మొండయ్య ,దాసరి గట్టయ్య కొంతం శ్రీనివాస్ ,గడ్డం శ్రీనివాస్, అంజి, చొప్పరి తిరుపతి,సాగి శ్రీనివాస్ రావు, కుక్క రవి, శ్రీనివాస్,పెండ్యాల రాజు, బొజ్జ సతీష్ , లల్లు కుషన్ రవి,బంగారు మహేష్, మామిడి రాజు,చిప్ప రాజుకుమర్, తాల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.