అర్హులైన వారందరికీ వీసాలు ఇవ్వాలన్నదే మా లక్ష్యం:అమెరికన్ కాన్సూలేట్ జనరల్
గుంటూరు:గుంటూరు వైద్య కళాశాలలో వీసాల జారీపై అవగాహన సదస్సును నిర్వహించింది. వీసా దరఖాస్తులు పూర్తిచేసే సమయంలో కచ్చితమైన సమాచారం ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అమెరికన్ కాన్సూలేట్ జనరల్ వైస్ కూన్సిల్ జెరిమి జువిట్ అన్నారు. అమెరిక చట్ట ప్రకారం వీసా ఇవ్వాలా.? వద్దా.? అనేది ఇక్క ధ్రువీకరణ పత్రాలపై ఆధారాపడి ఉంటుందని కాన్సులేట్ అధికారి అన్నీ అంశాలు పరీశీలించిన తర్వాత ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తుదారు చెప్పిన అంశాలపై సంతృప్తి చెందితేనే చెందితేనే వీసా ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని విద్యార్థి ప్రోపైల్‌లో విదార్హత వివరాలు కీలకమని, తక్కువ గ్రేడ్‌లు వస్తే అమెరికాలో విజయవంతమైన విద్యార్థిగా రాణించలేరని తెలిపారు. అమెరికాలో 25శాతం వైద్యులు భారతీయులేనని అన్నారు. ఇండియాలో ఎక్కడ పాస్‌పోర్టు తీసుకున్నా చెన్నై,హైదరాబాద్, ముంబాయి, కోల్‌కతా, ఢిల్లీలోని కాన్సూలేట్ కార్యలయాల్లో ఇంటర్య్వూలకు హాజరవ్వాచ్చని సూచించారు. కొందరు తప్పుడు ధ్రువికరణ పత్రాలతో వీసా పోందినట్లు ఆరోపణలు రావటంతో అప్రమత్తంగా ఉంటున్నామని అర్హులైన
వారందరికీ వీసాలు ఇవ్వాలన్నదే మా లక్ష్యం అమెరికన్ కాన్సూలేట్ జనరల్ తెలిపారు.