అలంపూర్ అభివృద్ధి పై వివక్షత చూపుతున్న ఎమ్మెల్యే అబ్రహం ఎండీ ఇంతీయాజ్ అలీ 4వ వార్డ్ కౌన్సిలర్
*అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 8)
అలంపూరు అభివృద్ధికి నిధులు వచ్చిన వాటి ఇతర మండలాల కుమళ్ళిస్తూ అలంపూర్ మండలం పై వివక్షత చూపు తున్నారు అని అలంపూర్ మునిసిపల్ నాల్గవ వార్డ్ కౌన్సిలర్ యండి ఇంతీయాజ్ ఆలీ అన్నారు. అలంపూర్ పట్టణంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కు డియంయాఫ్టీనిధులు మంజూరు చేశారు. అందులో భాగంగా అలంపూరు కు కస్తూర్భ గాంధీ స్కూల్ కి అక్షరాల 25 లక్షలు మంజూరు కాగా, ఇందులో కస్తూర్బ స్కూల్ కి వేళ్ళు రహాదారి లో మట్టిది ఉండటం వలన మేన్ రోడ్డు నుంచి అప్రోచ్ రోడ్డు వేయుటకు 6 నేలల ముందు ఎష్టిమెషన్ వేయడం జరిగింది అన్నారు.అందుకే అలంపూరు కస్తూర్బ స్కూల్ కి అంత అమౌంట్ మంజూరు అయిందిఅన్నారు.18 లక్షల 60 వేలు అప్రోచ్ రోడ్డుకు అవుతుంది, రోడ్డు లేక లొపలి వరకు గ్యాస్ బండి కానీ, సరుకుల బండి కానీ, కనీసం 2 వీలర్ బండి కూడా వేళ్ళేందుకు అ రోడ్డు సరిగా లేదు అన్నారు.అయితే ఎమ్మెల్యే అబ్రహం మాత్రం అలంపూరు కస్తూర్బ స్కూల్ కు మంజూరు అయినా 25 లక్షల లో 5 లక్షలు మాత్రమే స్కూల్ కి ఉంచి 20 లక్షలు తను వేరే మండలాలకు తీసుకేళ్లారు అన్నారు.
అలంపూరు కు వచ్చిన అమౌంట్ లోనుండి తన క్యాంపు అఫిస్ కి 8 లక్షలు కెటాయించుకున్నారు. మిగితా అమౌంట్ ఇంకా వేరే మండలాలకు తరలించారుఅన్నారు. ఇంత వివక్ష యందుకు అలంపూరు అంటే ఎమ్మెల్యే కి అలంపూరు ప్రజలకు సమాధానం చెప్పాలి, ఇంకా అలంపూరు లో ఉన్న నాయకులు మరి ఇప్పుడు అధికారం లో ఉన్న నాయకులు యందుకు మీకు అలంపూరు మీద ప్రేమ లేదా, అలంపూరు లో పుట్టినందుకు దీని మీద ప్రష్నించే అవసరం మీకు లేదా అన్నారు. అలంపూరు మండలం మీద కానీ, అలంపూరు టౌన్ మీద కానీ వివక్ష చూపకండి అన్నారు. 20 లక్షలు తరలించారో,అదే 20 లక్షలు మళ్ళీ తిరిగి తెచ్చి ఆ రోడ్డు పనిని పూర్తి చేయండి అన్నారు.ఇది నేను బక అలంపూరు బిడ్డగా అడుగుతున్నా మరి మీరు గనక చేయకపోతే ఉరి ప్రజలు మరి మండలం ప్రజలు సహించరు పెద్ద యత్తున అందోళనలు చెపడుతారుఅన్నారు.అన్ని పార్టీ లు కలిసి అలంపూరు అభివృద్ధి కి కలసి పాటుపడదాం అన్నారు.