అలంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరు*

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.
గద్వాల నడిగడ్డ, జూన్ 14 (జనం సాక్షి);
 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో   డయాలసిస్ సెంటర్ మంజూరు కావడం జరిగిందని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే  హాస్పటల్ ను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి,మార్చురీ ని పశిలించారు.మర్చరిలో ఉన్న నిరుపోయాగం రిఫర్జేటర్ ను బాగుచేయించి అందుబాటులోకి  రావాలని డాక్టర్ పరుష రాము ను ఆదేశించారు. అనంతరం హాస్పటల్ అవరణలో నిర్మిస్తున రోగుల  విశ్రాంతి భవనాన్ని పరిశీలించి భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీస్కొని రావాలని ఆదేశించారు. అనంతరం విలేకరలతో  విలేఖరుల ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.డయాలసిస్ కేంద్రాలను నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భం అన్నారు.ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్తే చికిత్స కంటే వైద్య పరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని, మూత్ర పరీక్ష నుంచి రక్త పరీక్ష వరకు ఏవేవో టెస్ట్‌లు రాస్తారు డాక్టర్. వాటికి వేలకు వేలకు పోయాల్సి ఉంటుందనీ, సామాన్య ప్రజలపై ఈ భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిందని అన్నారు.అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అని ఆయన తెలిపారు. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించనున్నారు.సమైక్య రాష్ట్రంలో కేవలం 7 మెడికల్ కాలేజీలు ఇప్పుడు జిల్లాకు ఓ మెడికల్
 కాలేజ్ పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు చర్యలు ఆరోగ్య శ్రీ, లు సి ఎం ఆర్ ఎఫ్, ఎల్ ఓ సి అందజేస్తున్నమని,లక్షలాది రూపాయల చికిత్సలకూ ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ దే అని అన్నారు.
డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కు నియోజక వర్గ ప్రజల తరుపున అలంపూర్ ఎం.ఎల్.ఎ డాక్టర్.వి.యం.అబ్రహం
కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ,వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి, మాజీ ఆలయ చైర్మెన్ నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు సుదర్శన్ గౌడ్, లక్ష్మీదేవి, సుష్మా,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య శెట్టి, కో ఆప్షన్ మెంబర్ అల్ల భకష్ ,పెద్ద ముక్తార్,గొందిమ్మల పెద్ద రెడ్డీ,ఉప ఉప అధ్యక్షడు నార్సన్ గౌడ్, క్యాతురు శేఖర్ రెడ్డీ, చందు,సోషల్ మీడియా కన్వీనర్ నరేంద్ర,యువజన విభాగం అధ్యక్షుడు మహేష్ నాయుడు,సమెల్ ,దేవ రాజు, జాన్,శ్రీనివాసులు,వలి,నాగరాజు, ఖలీల్,కిట్టు,
రాజేష్, శేఖర్,భూపాల్ ,రమేష్,డాక్టర్. పరుష రాము, వైద్య సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.