అలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి
అలంపూర్ ఎస్సై శ్రీహరి అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 23)
జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి ర్యాలీ లు గాని, ధర్నాలు నిర్వహించుకోవడానికి వీలు లేదని, 30 పోలీస్ యాక్ట్ ను ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలంపూర్ ఎస్ ఐ శ్రీహరి ఆదివారం ఒకప్రకటన లో తెలిపారు . అలంపూర్ పిఎస్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు లేదా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలనుకునే వారు ఎవరైనా, ఏ ఆర్గనైజేషన్ వారు అయిన, ఏ రాజకీయ పార్టీ వారైనా ముందస్తుగా పోలీస్ ల అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి 30 యాక్ట్ ను ఉల్లంఘించిన వారికి షోకాజ్ నోటీస్ లను జారీ చేసి అట్టి వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మరియు పోలీస్ ల అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించిన వారి పై కేసులు నమోదు చేయబడుతాయని, కావున పిఎస్ పరిధిలో ప్రజలందరూ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న విషయాన్ని గ్రహించి ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దని, ఎస్సై శ్రీహరి విజ్ఞప్తి చేశారు.