అలంపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

8.50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ*   *అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం*         *అలంపూర్ జనంసాక్షి  (నవంబర్ 19)*
అలంపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తూ,ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు.
శనివారం అలంపూర్ మున్సిపాల్టీ లోని 10 వార్డుల లో 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మరియు 3.50 కోట్ల రూపాయలతో సెంట్రల్ డివైడర్ మరియు లైటింగ్ పనులకు  అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, అలంపూర్
పట్టణo రూపురేఖలను మార్చి,ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ  లక్ష్యమని ఆయన అన్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో  పాటు, పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు  ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో, ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు.ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు.అలంపూర్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం జరుగుతుంది అని అన్నారు.పట్టణంలో అహ్లాదాన్ని పంచే మినీ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు .అలంపూర్  మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో అలంపూర్ కు అవార్డ్ రావడం దానికి సహకరించిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు అని తెలిపారు.పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, అమ్మఒడి, కేసీఆర్ కిట్, దళిత బంధు, వంటి మరెన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత  తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మున్సిపాలిటీ చైర్మన్ మనోరమ,వైస్ చైర్మన్ వెంకటేశ్వరెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు వార్డుల కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ మెంబర్లు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.