అలసత్వం వల్లే లీకేజీ
– తెలంగాణ ద్రోహులు మంత్రివర్గంలో ఉండొచ్చు
– జాక్‌లో లేరు
– మంత్రులపై చర్యలు తీసుకోవాలి
– కోదండరాం
హైదరాబాద్,జులై 29(జనంసాక్షి):ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. ‘నీట్’పై ముందే నిర్ణయానికి వచ్చివుంటే విద్యార్థులు రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…మెడికల్ ఎంట్రెన్స్‌కు సంబంధించి ప్రశ్నాపత్రం లీకేజీ వంటి ఘటనలతో విద్యార్థుల్లో పరీక్షల పట్ల విశ్వాసం సన్నగిల్లుతుందని తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా పక్కాగా చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం దురదృష్టకరమన్నారు. వేలమంది విద్యార్థులు ఈ పరీక్షను సీరియస్‌గా తీసుకుని రాశారని.. ఈ పరీక్ష రద్దయితే వారి పరిస్థితి గందరగోళంగా తయారవుతుందన్నారు. పర్యవేక్షణ లోపం వల్లనే పేపర్ లీక్ అయిందని కోదండరామ్ ఆరోపించారు. ముఖ్యమైన పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయాల నాయకత్వం సరిగా లేదన్నారు. దీంతో విద్యార్తుల భవిస్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రలు ఆవేదనను అర్థంచేసుకుని ప్రవర్తించాలన్నారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ ను సస్పెండ్ చేయాలని, మంత్రులు కూడా బాధ్యత వహించాలని అన్నారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఆగివుంటే వైస్ ఛాన్సలర్ల నియామకంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చేదికాదని పేర్కొన్నారు సరైన పర్యవేక్షణ లేకపోవడమూ కారణం. కార్పొరేట్ విద్యా రంగం పై కంట్రోల్ లేకపోవడం. యూనివర్సిటీల్లో వీసీలు లేకపోవడం కూడా కారణం. యూనివర్సిటీల పట్ల శ్రద్ద లేకపోవడం, అక్కడ సరైన నాయకత్వం లేకపోవడం. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఇట్లా జరగకుండా చుడాల్సి ఉంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయరా??. సీబీఐతో విచారణ జరిపించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మంత్రులు ఈ సంఘటన కు బాధ్యత వహించాలి. రాజీనామా వారి విజ్ఞతకే వదిలేశాం. తెలంగాణకు ద్రోహం చేసిన వారు ఉంటే మంత్రి వర్గంలో ఉండొచ్చు. మా జేఏసీలో లేరు. మల్లన్న సాగర్ పై డీపీఆర్ ప్రకారం నడుచుకోవాలి. మంత్రులు కూడా దీనికి బాధ్యత వహించాలి, విద్యారంగాన్ని మరింత పటిష్టం చేయాలి. మళ్లీ పరీక్ష పై విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సర్కారు సానుకూల నిర్ణయం తీసుకోవా లి.ఎంసెట్. కన్వినర్ పై చర్యలు తీసుకోవాలి. ఎంసెట్ లాంటి కీలక పరీక్ష పేపర్ లీక్ కావడం ప్రభుత్వం మొక్క అలసత్వం బయటపడింది. సర్కారు యూనివర్శిల నియామకం పై ఙఉఅ గౌడ్ లైన్స్ పాటించక పోవడంతో హైకోర్టులో అపహస్యం పాలయింది.