*అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారి సేవలు శ్లాఘనీయం.*
కోదాడ, ఆగస్టు12(జనం సాక్షి)
మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో మెయిన్ రోడ్డు పూర్తిగా ధ్వంసమవడంతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక చొరవతో అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారు 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ముందుకురాగా ఈ రోజు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీపీ చింతా కవిత రెడ్డి,యూనిట్ హెడ్ శ్రీధర్, హెచ్ ఆర్ హెడ్ సతీష్ గార్లు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ అల్ట్రాటెక్ వారు చేస్తున్న సేవలు శ్లాఘనీయమని కూచిపూడి గ్రామంలో పూర్తిగా ధ్వంసమైన ఆర్ అండ్ బీ రోడ్డు వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్రాన్స్ పోర్టింగ్ సమస్యతో ప్రమాదాలు జరిగుతున్న విషయాన్ని గౌరవ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ద్వారా అల్ట్రాటెక్ యాజమాన్యం వారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన యూనిట్ హెడ్ శ్రీధర్ ,మానవీయ కోణంలో వెంటనే ఆర్ అండ్ బీ వారి ద్వారా ఎస్టిమేషన్ చేపించి 25 లక్షలతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 100 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణానికి ముందుకు రావడం వారి సేవానిరతికి తార్కాణమని గ్రామానికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని అల్ట్రాటెక్ యాజమాన్యానికి, కంపెనీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో యూనిట్ హెడ్ శ్రీధర్, హెచ్ ఆర్ హెడ్ సతీష్,జడ్పీటీసీ మందలపు కృష్ణ కుమారి శేషు,సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు,పంచాయతీ కార్యదర్శి జీవిత,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.