అల్బేనియాలో భారీ భూకంపం

న్యూఢిల్లీ,నవంబర్‌26(జనం సాక్షి): అల్బేనియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదు అయ్యింది. గత రెండు నెలల్లో శక్తివంతమైన భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ఇది రెంవసారి అని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొన్నది. అల్బేనియా రాజధాని తిరానాతో పాటు తీర ప్రాంత నగరం డురెస్‌లో భూకంప ధాటికి బిల్డింగ్‌లు కుప్ప కూలాయి. సుమారు రెండు భారీ భవంతలు నేలమట్టం అయ్యాయి. తిరానకు 30 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని ఆర్మీ రక్షిస్తున్నది.