అవగాహనా లేకుండానే కడుపు కోశారు..క్యాన్సర్ ఉందని కుట్లేసి పొమ్మన్నారు.!

జనం సాక్షి నాగర్ కర్నూల్ టౌన్ :- నెలలుగా నిరవదిక రుతు స్రావం జరుగుతోందని బాధపడుతూ ఓ మహిళ ఆసుపత్రికి చేరగా వైద్యురాలు రిపోర్టులను పరిశీలించి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. తీరా ఆపరేషన్ మధ్యలో వదిలేసి పేగులన్నీ వడిపడ్డాయి, క్యాన్సర్ అయి ఉంటుందని అనుమానంతో మళ్లీ కుట్లేసి చేతులెత్తేసారు. ఈ విచిత్ర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శివ నర్సింగ్ హోమ్ లో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన భాగ్యమ్మ (45) గత కొంతకాలంగా వరుసగా ఋతుస్రావం జరుగుతుందని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు రక్త మూత్ర పరీక్షలు జరిపి అనుమానం రావడంతో పాలమూరులోని ఎస్వీఎస్ హాస్పిటల్ లో పరీక్షలు జరిపి రిపోర్టులు తెప్పించుకున్నారు. అందులో క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని గమనించి అక్కడి వైద్యులు హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. కానీ అక్కడే ఉన్న కొంతమంది శివ నర్సింగ్ హోమ్ వెళ్లాలని సూచించారు.  కాగా శనివారం ఉదయం 7గంటలకు అక్కడి వైద్యురాలు స్వాతి రిపోర్టులను పరిశీలించి ఆపరేషన్ చేస్తానని 30వెలు ఫీజు మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆపరేషన్ స్టార్ట్ చేసి వెంటనే పేగులన్నీ ముడిపడి ఉన్నాయని క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తూ వెంటనే కుట్లు వేసి తమ వల్ల కాదని హైదరాబాద్ వెళ్లాలని చేతులెత్తేశారు. దీంతో బాధితులు లబోదిపోమంటూ ఏం చేయాలో అర్థం కాక లబోదిబో మంటూ విలపించారు. కొద్దిసేపు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన దిగారు. తమవల్ల కాదని ముందే చెప్పి ఉంటే హైదరాబాద్ వెళ్లే వాళ్ళమని ఇష్టం వచ్చినట్లు కత్తిపోట్లు వేసి కాదు పొమ్మనడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా రిపోర్టులో క్యాన్సర్ లక్షణాలు ఏమీ లేవని ఉండబట్టే ఆపరేషన్ స్టార్ట్ చేశామని చెప్పొచ్చారు.