అవతరణ వేడుకలకు ముస్తాబవుతున్న కవాతు మైదానం
మహబూబ్‌నగర్,మే31(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికరా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల్లలో 2న అవతరణ వేడుకలను వాటిని సిద్దం చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో జెండా ఆ విష్కరణ ఉంటుంది. పోలీసు కవాతు మైదానంలో జరిగే పోలీసు కవాతు, గౌరవ వందన స్వీకారం, మైదానంలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జెసి వెంకట్‌రావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3 రోజులపాటు రాష్ట్ర అవతరణ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించాలన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల నిర్వహణకు సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా జూన్ 2న జిల్లా, డివిజన్, మండల, పంచాయతీలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.