అవస్థల వాలయంలో ప్రభుత్వ పాఠశాల..
-మానవపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు
-ప్రహరీ లేకపోవడంతో అడ్డుగా కట్టెలు కట్టిన దృశ్యం..
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 17 (జనంసాక్షి):- మానవపాడు లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. ఈ పాఠశాల భవనాన్ని 30 ఏళ్ల క్రితం నిర్మించగా ప్రస్తుతం మరమ్మతులకు గురైంది. ఇక్కడ ఒక హెచ్‌ఎం, ముగ్గురు ఎస్జీటీలు విధులు నిర్వహిస్తున్నారు. 128 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో నాలుగు తరగతి గదులుండగా రెండు గదులు ఫర్వాలేదనిపించినా మరో రెండు గదుల గోడలు పగుళ్లు రావడంతోపాటు పై భాగంలో పెచ్చులూడి దర్శనమిస్తున్నాయి. పాఠశాల చుట్టు పక్కల పూర్తి స్థాయిలో ప్రహరీ లేదు. బాలుర కోసం నిర్మించిన మూత్రశాలకు నీటి సౌకర్యం లేకపోవడంతో కొంత కాలంగా నిరుపయోగంగా దర్శనమిస్తుంది. మూత్రశాలకు తలుపు కూడా విరిగిపోయింది.