అవినీతి నిరోధక చర్యలపై కేంద్రప్రభుత్వం అసంతృప్తి
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు సంబంధించి కేంద్రప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. అవినీతిని సమర్ధంగా నిరోధించేందుకు విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని గతంలో మంత్రుల బృందం సిఫారసు చేసింది. ప్రభుత్వం గత నెల 17 న అవీనితి కట్టడి ప్రస్తుతం మీమీ శాఖల్లో తీసుకుంటున్న చర్యలు ఏమిటో తెలియజేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది. జులై ఆఖరునాటికి సమాధానాలివ్వాలని కూడా స్పష్టం చేసింది. దీంతో గత ఆదేశాలను గుర్తుచేస్తూ కేంద్రం తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. క్రమశిక్షణ ఉల్లఘనలకు సంబంధించి ఎన్ని విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. పని ఒత్తిడి ఎంత. సిబ్బంది కొరతా ఉందా. నిఘూ విభాగానికి ఎంతమందిని కేటాయించారు. పనిలో ఆ శాఖకు ఎదురయ్యే సమస్యలేంటి. తదితర ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు పంపించాలని మరోసారి కోరింది. ప్రభుత్వం కోరిన వివరాలు పంపాయని సిబ్బంది వ్యవహారాల శాక అధికారి ఒకరు తెలిపారు.