*అవినీతి నిర్మూలన లో యువత ముందుండాలి*

*ఎస్సై తాజోద్దిన్*
వెంకటాపూర్(రామప్ప) జనం సాక్షి :యువత సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ,అవినీతి నిర్మూలన లో ముందుండాలని వెంకటాపూర్ ఎస్సై తాజోద్దిన్ అన్నారు.గురువారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షుడు పంబిడి శ్రీధర్ రావు అధ్వర్యంలో యాక్ బృందం మర్యాదపూర్వకంగా నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన తాజొద్దిన్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా యాక్ సభ్యులను వారు చేస్తున్న కార్యక్రమాలను ఎస్సై అడిగి తెలుసుకుని అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాలన్నారు.అప్పుడే అవినీతి తగ్గుతుందన్నారు.అవినీతి రహిత సమాజం కోసం యాక్ సంస్థ మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.యువత స్వచ్ఛందంగా అవినీతిపై చేస్తున్న కార్యక్రమాలకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో యాక్ సభ్యులు దండేపెల్లి సారంగం,రుద్రోజు బ్రహ్మచారి,చెవుల జనకరాజు,ఓజ్జల తిరుపతి,కొత్తపెల్లి అనీష్ తదితరులు పాల్గొన్నారు.