అవినీతి పాలనను అంతం చేద్దాం

బహుజనుల రాజ్యాధికారాన్ని సాధిద్దాం
పాలకుర్తి గడ్డమీద నీలి జెండా ఎగరేద్దాం
అగ్రవర్ణాల ఆధిపత్యం ను చిత్తు చేద్దాం
బహుజనులారా ఏకంకండి
– జిలుకర రవికుమార్(బీఎస్పీ పాలకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు)
పెద్దవంగర మండలం నూతన అధ్యక్షునిగా రాంపాక కిరణ్

 

పెద్దవంగరజులై18(జనం సాక్షి )
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనను అంతం చేసి బహుజన రాజ్యాధికారం సాధించుకుందామని,పాలకుర్తి గడ్డమీద నీలి జెండా ఎగరవేసి ఆధిపత్య పార్టీల అహంకారాన్ని చిత్తు చేయడానికి బహుజనులంతా ఏకం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం అధ్యక్షులు జిలుకర రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దవంగర మండల కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గం బీఎస్పీ ఇంచార్జీ సోమారపు ఉపేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దవంగర బీఎస్పీ నూతన మండల కమిటి నియామకం సమావేశానికి జనగామ జిల్లా బీఎస్పీ ఇంచార్జీ నీర్మాల రత్నం, జిల్లా అధ్యక్షులు బసవళ్ల సిద్దయ్య, నియోజకవర్గం ఉపాధ్యక్షులు పడమటింటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఈదునూరి ప్రసాద్ సమక్షంలో పెద్దవంగర మండల అధ్యక్షుడిగా నియమితులైన రాంపాక కిరణ్,నూతన సభ్యులకు నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ నీర్మాల రత్నం మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో బహుజనులు ఏకమయ్యారని, రాబోయే ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్ధి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి మరింత పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గం అధ్యక్షులు జిలుకర రవికుమార్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఆధిపత్య వర్గాలే రాజ్యమేలుతూ బహుజనులకు చేసిందేమీ లేదని, మభ్య పెట్టుడం తప్ప కనీస మౌళిక వసతులు కల్పించలేని అహంకారపూరితమైన పాలకులకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. పాలకుర్తి గడ్డ నుంచి నీలి జెండాను ఎగరవేసి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోడానికి బహుజనులంతా ఏకం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ట్రెజరర్ చిలుముల క్రిష్ణ,పాలకుర్తి నియోజకవర్గం కార్యదర్శి రాపాక అనిల్ కుమార్, రాయపర్తి మండల అధ్యక్షులు చిలుముల రంజీత్, పెద్దవంగర నూతన కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర మండలం బీఎస్పీ నూతన కమిటీ సభ్యులు
మండల అధ్యక్షులుగా రాంపాక కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా జాటోత్ అనిల్ నాయక్, కోశాధికారిగా చిలుక మల్లేష్, కార్యదర్శిగా రాంపాక బిక్షం, సోషల్ మీడియా ఇంచార్జీగా చిలుక శ్రీకాంత్ నియమితులయ్యారు.