అవుటర్ రింగ్ రోడ్డుపై కారు కాలిపోయింది..

రంగారెడ్డి : అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ కారు దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ టోల్‌ప్లాజా ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ ప్రాంతానికి చెందిన నలుగురు ఉప్పల్‌కు ఫోర్డ్ ఐకాన్ కారులో వెళుతున్నారు. టోల్ ప్లాజ్ సమీపంలోకి వచ్చేసరికి ఇంజన్ వేడెక్కి మంటలు చెలరేగాయి. కారు ఆపి అందులో ఉన్న నలుగురు కిందకు దిగిపోయారు. మంటలకు కారు పూర్తిగా దగ్ధం అయిపోయింది.