అవును ..బిజెపిలో చేరుతున్నా!


జార్ఖండ్‌ మాజీ సిఎం చంపయ్‌ సోరెన్‌ వెల్లడి
రాంచీ,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడు చంపాయ్‌ సోరెన్‌ సొంత పార్టీ పెడుతారా.. లేదంటే బీజేపీలో చేరుతారా..? అనే సందిగ్దానికి తెరపడిరది. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 30న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జార్ఖండ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు. చంపాయ్‌ సోరెన్‌ ఇప్పుడు స్వయంగా ధ్రువీకరించారు. ఈ నెల 18న నేను ఢల్లీికి వచ్చినప్పుడే నా స్థానం ఏమిటో స్పష్టం చేశాను. వాస్తవానికి ముందుగా నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ ప్రజలలో నాకున్న మద్దతు చూసి నిర్ణయం మార్చుకున్నా. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా’ అని చంపాయ్‌ సోరెన్‌ చెప్పారు. ఈ నెల 30న విూరు బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి, వాస్తవమేనా అన్న విూడియా ప్రశ్నకు చంపాయ్‌ సోరెన్‌ అవునని సమాధానం ఇచ్చారు. కాగా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భూకుంభకోణం కేసులో అరెస్ట్‌ కావడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన
స్థానంలో సీనియర్‌ నాయకుడు చంపాయ్‌ సోరెన్‌ను సీఎంగా నియమించారు. అయితే గత నెలలో ఆ కేసులో హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చంపాయ్‌ సోరెన్‌తో రాజీనామా చేయించి సీఎం పదవి చేపట్టారు. దాంతో తన నుంచి అవమానకరంగా సీఎం పదవి లాక్కున్నారని చంపాయ్‌ సోరెన్‌ మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో తదనంతర పరిణామాలు చోటుచేసుకున్నాయి.