అశ్వారావుపేట లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
అశ్వారావుపేట, సెప్టెంబర్ 27(జనంసాక్షి )
స్వతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుక్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
అశ్వారావుపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారి ఆదేశాల మేరకు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది ఈ సంధర్భంగా పలువురు మాట్లాడుతూ నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయని జన్మదినం పురస్కరించుకొని వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, అశ్వారావుపేట,సర్పంచ్ అట్టం రమ్య, ఉట్లపల్లి సర్పంచ్ సాదు జొస్నాబాయ్,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్, టౌన్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, కలపాల శ్రీనివాసరావు, ధర్మారావు చిన్ని వెంకన్న బాబు ప్రసాదు చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు .