అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి…
ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయండి…
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్..
రామన్నపేట నవంబర్ 11 (జనంసాక్షి) అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ మాట్లాడుతూ అసంఘాటీత రంగంలో పనిచేస్తున్న హమాలీ, లారీ, ట్రాక్టర్, ఆటో డ్రైవర్స్ మరియు అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ లేకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అయన ఆరోపించారు, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 5000 పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోని వారికి సామాజిక భద్రత కల్పించాలనిఆయన డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో ఈ నెల 27,28,29 తేదీలలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించుకొని రాబోయే కాలంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి పోరాట కారిక్రమం రూపకల్పన చేసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా మొదటి రోజు 27వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు జిల్లాలోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు గొరిగె నరసింహ, ఏఐటీయుసి మండల కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి దుర్యోధన, లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు గోపగోని అశోక్, నాయకులు గొరిగే శంకరయ్య, బెల్లి అంజయ్య, నంగునూరి యాదయ్య, ఊట్కూరి శంకర్, పర్ష సుదర్శన్, రేపాక రమేష్, తదితరులు పాల్గొన్నారు.