అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయి: చంద్రబాబు
హైదరాబాద్ : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఈ 9 సంవత్సరాల్లో 22,500 మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. తెదేపా హయాంలో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేకపోయిందని మండి పడ్డారు. ‘అమ్మహస్తం’ మొండి హస్తమన్న తన వ్యాఖ్యాలు ఇప్పుడు నిజమయ్యాయని అన్నారు. రైతుల భూములను కారుచౌకగా కొట్టేసి పెత్తందార్లకు కట్టబెట్టారని అరోపించారు.