అసహనంపై వామపక్షాల నిరసన

4

న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జనంసాక్షి):

దేశంలో పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ వామపక్ష ఎంపీలు పార్లమెంటు మెయిన్‌ గేటు దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ పాలనలలో దేశంలో మతత్వం పెరిగిపోతోందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అసహనంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కూడా పాలక బీజేపీ సభ్యులు, మంత్రులు అసహనం ప్రదర్శించడాన్ని వామపక్ష ఎంపీలు తప్పుపట్టారు. సీరాం ఏచూరి, రాజా తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశంలో పెరుగుతున్న అసహనం అభివృద్ధి ప్రభావం చూపుతోందని లోక్‌సభలో ఆందోళన వ్యక్తమయ్యింది. అసహనంపై రెండో రోజు కూడా చర్చ కొనసాగింది. అసహనంతో దేశానికి పెట్టుబడులు రాకుండాపోయే ప్రమాదం ఉందని ప్రారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నా డీఎంకే సభ్యుడు పీ కుమార్‌ సభ దృష్టికి తెచ్చారు.