అసహనం ప్రధాన ఎజెండా

3
– అస్త్రశస్త్రాలతో విపక్షాలు

– వాడివేడీగా నేటి నుంచి పార్లమెంట్‌

– అసహనంపై చర్చిస్తాం

– వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి):

నేటి  నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇటీవలి బీహార్‌, మధ్యప్రదేశ్‌ లో ఓ స్థానం ఓటమి బిజెపిని కుంగదీసేవిగా ఉన్నాయి. దేశంలో పెరిగి పోయిన అసహనం ప్రధాన ఎజెండాగా  మరోవైపు పెరిగిన ధరలు, ప్రధాని హావిూలపై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు విపక్షాలు సిద్దంగా ఉన్నాయి.  ఎఫడిఐల జోరు పెంచడంపై నిలదీసేందుకు కూడా కాంగ్రెస్‌ సిద్దం అవుతోంది. మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికలో ఒక్కసీటును గెలవడంతో కాంగ్రెస్‌ మంచి ఊపువిూదుంది. దీంతో ఆ పార్టీ ఇక అధికార బిజెపిని నిలదీసేలా కార్యాచరణతో సిద్దం అవుతోంది. వివిధ సమస్యలు, ధరల పెరగుదల తదితరల అంశాలను ఆసరాగా చేసుకుని విపక్షాలు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయవచ్చు. ప్రధాని దేశాన్ని విడిచి సాముచేస్తున్నారని, విదేవృ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని రాహుల్‌ తదితరులు ఆరోపిస్తున్నారు. ఈ దశలో శీతాకాల సమావేశాలు వేడిపుట్టించనున్నాయి. మరోవైపు విభజన అంశాలపై టిఆర్‌ఎస్‌ కూడా కత్తులు నూరుతోంది. కేంద్ర వైఫల్యంతో పాటు, అనేక అంశాలపై నిలదీస్తామని ఇప్పటికే ప్రకటించారు.  హైకోర్టు విభజన సహా అనేకానేక సమస్యలు ఇంకా పట్టి పీడిస్తున్నాయి. వీటిని పరిస్కరించాలని కోరుతూ టిఆర్‌ఎస్‌ ఎప్పటినుంచో ఆందోలనచేస్తోంది. ఈ దశలో పార్లమెంట్‌ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నివాసంలో బిజెపి సీనియర్‌నేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఎన్డీఏ సమావేశంపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం. విపక్షాల దాడిని తిప్ప్పి కొట్టడం తదితర విషయాలపై కసరత్తు చేస్తున్నారు. భేటీలో కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, రవిశంకర్‌ప్రసాద్‌, సుజనాచౌదరి, టిడిపి ఎంపీ సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఇకపోతే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో అసహనం సెగ పుట్టించనుంది. దేశంలో అసహనం పెరిగిందంటూ ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ అంశంపై పార్లమెంట్‌లో చర్చింనున్నారు. అసహన అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం జీఎస్‌టీ బిల్లును అడ్డుకోరాదని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో అసహనంపై చర్చ చేపట్టాలని నోటీసు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో అఖిల పక్ష సమావేశంలో వీరంతా పాల్గొన్నారు.   నెల రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌టీ బిల్లు అమలులోకి వస్తుందని కేంద్ర సహాయమంత్రి జయంత్‌ సిన్హా కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే  భారత్‌లో అసహనం ఎక్కువైందని బాలీవుడ్‌ నటుడు అవిూర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపట్ల కేంద్రమంత్రి వెంకయ్యానాయుడు స్పందించారు. ఆ వ్యాఖ్యలు తమను చాలా బాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దురదృష్టవశాత్తు, తెలిసో, తెలియకో ఆయన అన్న మాటలు తమ మనసులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయని చెప్పారు. కొంతమంది ప్రజలు తప్పుదోవలోకి మళ్లించబడుతున్నారు. కొంతమంది తప్పుదోవడపడుతున్నారు. ఈ కేటగిరిలోకి వచ్చినవారిని నేరుగా ప్రస్తావించను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను ఇతర ఏ దేశాల్లో లేని చక్కటి పరిస్థితులు మాత్రం భారత్‌లో  ఉన్నాయి. అందుకే భారత్‌లో  సహనం ఎక్కువ. భారత ప్రజలు సహనపరులు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన ఘర్షణలు తగ్గుతూ వచ్చాయని వెంకయ్య అన్నారు. అమాయక ప్రజలను మావోయిస్టుల చంపేసే ఘటనలు తగ్గిపోయాయని, వేధింపులు కూడా తగ్గుముఖం పట్టాయి అని ఆయన చెప్పారు. అమిర్‌ ఖాన్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సమర్ధించడంపట్ల కూడా వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ నేతగా ఎదుగుతున్న క్రమాన్ని చూసి కాంగ్రెస్‌ పార్టీ ఓర్వలేకపోతుందని అన్నారు. ఈ సందర్భంగా తాము పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా వివరించారు. అవి కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్ల్రోనే సంభవించాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం కేవలం

అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది తప్ప ఒకరిపై ఒత్తిడి తీసుకురావడం, మరికొందరిపై ఆంక్షలు విధించడం, పరిమితులు విధించడంలాంటి చర్యలేమి చేయడం లేదని అన్నారు. దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్‌ ఆందోళన చెందుతోందని, దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని అవిూర్‌ ఖాన్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. . కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా దీనిపై మాట్లాడుతూ తెలిసో తెలియకో అవిూర్‌ఖాన్‌ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. అవిూర్‌ ఖాన్‌ అలా మాట్లాడకుండా ఉండాల్సింది కాదని పేర్కొన్నారు. మంచి నటుడుగా పేరొందిన అవిూర్‌ ఖాన్‌ బాద్యత మరచి మాట్లాడరాదని అన్నారు. దేశంలో అసహనం అంటూ కొందరు చేస్తున్న దుష్పచ్రారం చేస్తున్నవారికి ఊతం ఇచ్చే విధందంగా అవిూర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. పాక్‌ తో పాలు పాశ్చాత్య దేశాలకన్నా బారత్‌ చాలా సహనశీల దేశమని ఆయన అన్నారు.