అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు..
మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫోటోల పోస్టర్లను విడుదల చేస్తున్న పోలీసులు
వేమనపల్లి,సెప్టెంబర్ 23 (జనంసాక్షి)
అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు.శుక్రవారం వేమనపల్లి మండలంలోని రాజారం గ్రామపంచాయతీలో నిర్వహించిన పోలీసులు మీ కోసం కార్యక్రమానికి హాజరయ్యారు.గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా డిసిపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అసాంఘిక శక్తుల వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడు తుందన్నారు.గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఆశ్రయం కల్పించవద్దని తెలిపారు.విద్యార్థులు,యువకులు ఉన్నత చదువులు చదువుకోవాలని,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచిం చారు.గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు కావున వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు.గిరిజనులకు ఎల్లప్పుడూ క్షేత్రస్థాయి పోలీస్ అధికారులు అందుబాటులో ఉండి వారికి ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ వారి ఉన్నతికి తోడ్పడడానికి పోలీస్ శాఖ ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అందించే వివిధ లబ్ధి కార్యక్రమాలను గిరిజనులకు చేరవేయడానికి పోలీస్ శాఖ,ప్రభుత్వఅన్ని శాఖల సమన్వయంతో ఉందని అన్నారు.అనంతరం గిరిజనులకు దుప్పట్లు,బియ్యం,మహిళలకు చీరలు,యువకులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు.మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులతో ఉన్న పోస్టర్లను విడుదల చేశారు.ఫొటోలో ఉన్న వారి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని,సమాచారం ఇచ్చిన వారి పేర్లను గొప్యంగా ఉంచి,పారితోషికం అందిస్తామని డీసీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ గోపతి నరేందర్,చెన్నూర్ రూలర్ సీఐ విద్యాసాగర్,చెన్నూరు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, నీల్వాయి ఎస్ఐ గోపతి నరేష్,చెన్నూరు టౌన్ ఎస్సై మహేందర్,పోలీసులు పాల్గొన్నారు.